ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో మెగా హీరో 'ఉప్పెన', రామ్ 'రెడ్' సినిమాలు


లాక్ డౌన్ కారణంగా సినిమా థియేటర్లు మూతపడ్డాయి. ఇక తిరిగి ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి. దీంతో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలను దర్శక నిర్మాతలు నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్, హాట్ స్టార్, జీ5 మొదలగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో డైరెక్ట్ గా విడుదల చేస్తున్నారు. తాజాగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న ‘ఉప్పెన’ సినిమా కూడా ఓటీటీలో విడుదల కానుందని తెలుస్తోంది.

ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది అంటున్నారు. లాక్‌డౌన్ లేకపోతే ఈ సినిమా ఏప్రిల్‌లోనే విడుదల కావలసి ఉంది. ఈ సినిమాకి సుకుమార్ కథ అందించగా..ఆయన శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహించారు. తమిళ నటుడు విజయ్ సేతుపతి ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించారు. హీరోయిన్‌గా క్రితి శెట్టి నటించింది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నవీన్ ఎర్నేని, రవిశంకర్‌లు ఈ చిత్రాన్ని నిర్మించారు.


తాజాగా రామ్ నటించిన రెడ్ మూవీ సైతం ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ద్వారా విడుదల కాబోతున్నట్టు వార్తలు వస్తుండంగా.. హీరో రామ్ స్పందిస్తూ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ‘సినిమా అనేది కొందరి ఫ్యాషన్, చాలా మందికి వ్యాపారం…ఇక మిగిలిన వారికి జూదం.. వీళ్లు సినిమాను ఒక్కొక్కరూ ఒక్కో కోణంలో చూస్తారు’ అంటూ ట్వీట్ చేస్తూ # ఓటీటీ, #థియేట్రికల్ అంటూ హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు రామ్. ఓటిటి ద్వారా రామ్ నటించిన ‘రెడ్’ మూవీ విడుదలయ్యే అవకాశం కలదని వార్తలు వస్తున్న నేపథ్యంలో రామ్ చేసిన ట్వీట్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంతకీ రామ్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌ని విమర్శిస్తున్నారా? లేక మద్దతు ప్రకటిస్తున్నారా? అన్న విషయాన్ని మాత్రం సూటిగా చెప్పలేదు.

0/Post a Comment/Comments

Previous Post Next Post