OTT ప్లాట్ ఫామ్ లో రానా దగ్గుబాటి అరణ్య ?


లాక్ డౌన్ వల్ల పెద్ద సినిమాలతో పాటు చాలా చిన్న సినిమాలు కూడా ఆగిపోయాయి. మరోవైపు చాలా సినిమాలు ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్నా కానీ థియేటర్లలో విడుదల చేయలేని పరిస్థితి. దాంతో నిర్మాతలకు కూడా ఏం చేయాలో అర్థం కావడం లేదు. అందుకే వాళ్లు కూడా మరో ప్రత్యామ్నాయం దిశగా అడుగేస్తున్నారు. ఈ క్రమంలోనే అందరికీ కనిపిస్తున్న అషన్ ఓటిటి ప్లాట్ ఫామ్. ఇప్పటికే అమెజాన్ అరడజన్‌కు పైగా సినిమాలను కొనేసి నేరుగా విడుదల చేస్తుంది. ఇప్పుడు రానా దగ్గుబాటి హీరోగా నటించిన అరణ్య సినిమా కూడా నేరుగా డిజిటల్‌లో విడుదల కానుందనే ప్రచారం జరుగుతుంది.

ఈ సినిమా టీజర్ కూడా అదిరిపోయింది.. మంచి అప్లాజ్ వచ్చింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ తెరకెక్కింది. తమిళంలో కాండన్, నార్త్‌లో హాథీ మేరె సాథీ..  పేరుతో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు ప్రభు సాల్మాన్. ఏప్రిల్ 2న విడుదల చేయాలని అనుకున్నారు. ఇప్పుడు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషలకు కూడా కలిపి అదిరిపోయే ఓటిటి డీల్ నిర్మాతల దగ్గరికి వచ్చిందని తెలుస్తుంది. ఈ సినిమా హక్కులను తమకు ఇవ్వాలంటూ నెట్ ఫ్లిక్స్ నేరుగా నిర్మాత సురేష్ బాబును అడిగారని ప్రచారం జరుగుతుంది.

ఈరోస్ ఇంటర్నేషనల్ ఈ సినిమాను నిర్మించింది.. కానీ రానా హీరో కాబట్టి సురేష్ బాబు దగ్గరకు వచ్చారని తెలుస్తుంది. ఆయన కూడా సానుకూలంగానే ఉన్నాడని.. దర్శక నిర్మాతలను అడిగి తన నిర్ణయం చెప్తానని సురేష్ బాబు చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏనుగులు ఉన్న సీన్స్ షూటింగ్ చేయడానికి థాయ్‌ల్యాండ్ వెళ్లారు. ఇందులో తమిళ హీరో విష్ణు విశాల్ కీలక పాత్ర పోషించాడు. నిజంగానే ఈ పాన్ ఇండియన్ సినిమా కానీ ఓటిటిలో విడుదలైతే అదో సంచలనమే.

0/Post a Comment/Comments

Previous Post Next Post