పవన్ vs మహేష్ రాబోయే రోజుల్లో సోషల్ మీడియా వార్స్ !
కొంత కాలం క్రితం వరకు హీరోల అభిమానుల మధ్య చర్చలు, సంభాషణలు, పోటీలు బయట నిజంగానే జరిగేవి. కానీ ఇప్పుడు అదంతా ఆన్ లైన్ సోషల్ మీడియాకు మారిపోయింది.జస్ట్ తమ హీరోలను సపోర్ట్ చేసుకోవటమే కాకుండా ఇతర హీరోల సినిమాలు విడుదలైనప్పుడు చర్చల్లో పాల్గొంటాం లాంటివి చేస్తుంటారు. కొన్ని సందర్భాలలో ఈ చర్చలు హద్దులు దాటుతుంటాయి కూడా. రాజకీయాలలో పవన్ కళ్యాణ్ బిజీ కావటంతో సోషల్ మీడియాలో యాక్టివిటీలో మిగిలిన హీరోలకంటే ముందంజలో వున్నారని అంటారు.
అన్ని విషయాలలో తమ హీరోకి మద్దతుగా నిలవటం, యాంటీ ఫాన్స్ చేసే కామెంట్స్ కు, ప్రచారాలకు ధీటుగా సమాదానాలు ఇవ్వటం లాంటివి చేస్తూ యాక్టివ్ గా ఉంటున్నారు. ఐతే సోషల్ మీడియాలో మహేష్ బాబుకి ఉన్నట్టుగానే పవన్ కళ్యాణ్ కి కూడా పెద్ద ఆర్మీ ఉంది. ఈ సోషల్ మీడియా ఫాన్ ఫాలోయింగ్ అనేది పవన్ కళ్యానికి రాజకీయాలలో పెద్దగా ఉపయోగపడలేదు కానీ సినిమాల విషయంలో బాగానే ఉపయోగపడుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ మధ్య ట్విట్టర్ లో 8 ఇయర్స్ ఆఫ్ గబ్బర్ సింగ్ ట్రెండ్ కావటంలో పవన్ కళ్యాణ్ ఫాన్స్ కీలక పాత్రగా నిలిచారు. దీంతో సోషల్ మీడియాలో రానున్న రోజుల్లో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ హవా గట్టిగానే ఉండబోతోందనే అంచనాలు ఉన్నాయి. ఇది ఫాన్స్ మధ్య పోటీగా మారే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు.
కోలీవుడ్ కి సంబంధించి సోషల్ మీడియాలో ఎక్కువగా అజిత్ ,విజయ్ ల అభిమానుల హంగామా కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా తమ హీరోలకు సంబందించిన హ్యాష్ ట్యాగ్లు ట్రెండ్ చేయటంలో వారు చాలా పట్టుదలగా ఉంటారు. టాలీవుడ్ లోని స్టార్ హీరోల ఫాన్స్ కూడా ఈ మధ్య ఈ ధోరణి కనబరుస్తున్నారు. మిగతా హీరోలకంటే ఈ విషయంలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అభిమానుల సందడి ఎక్కువగా ఉందట. ఈ ఇద్దరి తరువాత సోషల్ మీడియాలో ఎక్కువగా అల్లు అర్జున్ అభిమానుల హవా ఉంటుందంటున్నారు.
సాధారణ ప్రజలు కూడా సంప్రదాయ మీడియా నుంచి మెల్లగా సోషల్ మీడియాకు మారుతుండటంతో కొంతమంది హీరోలు సోషల్ మీడియాలో వారి అభిమానులు యాక్టివ్ గా ఉండేలా చర్యలు కూడా తీసుకుంటున్నారట. ఇందుకోసం ప్రత్యేకంగా టీమ్స్ ని కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారట.
Post a Comment